![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి శివ శంకర వరప్రసాద్ మూవీలోని చిరు కొడుకుగా నటించిన చిన్నారి ఊహ వచ్చింది. ఈ ఎపిసోడ్ ని చిల్డ్రన్స్ స్పెషల్ ఎపిసోడ్ సమ్మర్ క్యాంపుగా రాబోతోంది. విశ్వా కొడుకు ర్యాన్, సమీరా భరద్వాజ్ కూతురు ఆద్య, అంజలి పవన్ కూతురు చందమామ, ఋద్వేద్ కూడా వచ్చారు.
"రాబిట్ వచ్చిందిగా మాట్లాడదాం కూర్చో" అంటూ శ్రీముఖి ఋద్వేద్ కి చెప్పింది. "నేను కూర్చుంటే మళ్ళీ నేను లెగలేను" అన్నాడు. అంతే ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు. తర్వాత అవినాష్ , శ్రీముఖి కలిసి సరిగమ అంటూ ఆద్య ముందు పాడారు. "నేను ఎలా పాడాను" అని అవినాష్ అడిగాడు. "నువ్వు అచ్చం కప్పలా నోరు తెరిచావ్ " అని పరువు తీసేసింది. తర్వాత ఊహని పిలిచి "అవినాష్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పు" అంటూ శ్రీముఖి అడిగింది. "చాలా బాడ్ గా ఉంది " అని చెప్పింది ఊహ. తర్వాత హరి తన అరచేతిని చూపిస్తూ "చిలకా నా ఫ్యూచర్ చెప్పు అన్నాడు".."ఈయనకు ప్రెసెంట్ లేదు ఇంకా ఫ్యూచర్ కూడా లేదు " అనేసింది.
తర్వాత శ్రీముఖి పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకుని "నువ్వు చందమామ, మాయ ముగ్గురు కలిసి ఒక బోట్ లో వెళ్తున్నారు. మీ ముగ్గురు మునిగిపోతున్నారు . ఇక్కడ ఈ ముగ్గురిలో ర్యాన్ నీ ఒక్కడికే స్విమ్మింగ్ వచ్చు నువ్వు ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తావ్ " అని అడిగింది. "అసలు మీరు చెప్పింది రాంగ్ . మాయ స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్తోంది" అంటూ శ్రీముఖి పరువు తీసేసాడు ర్యాన్. ఇక శ్రీముఖి ఏమీ మాట్లాడలేక నవ్వి ఊరుకుంది.
![]() |